కొలంబియా యూనివర్సిటీలో 2007లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లలో బీఏ విద్యను అభ్యసించిన టీనాతో పాటు మరో ముగ్గురు అమెరికన్లు ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయినట్లు అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వర్గాలు ప్రకటించాయి. కాగా... డాక్యుమెంటరీ తీయడంతోపాటు... ఆకాంక్ష ఫౌండేషన్‌లోని సంగీత, నాటక కేంద్రాన్ని కూడా టీనా అభివృద్ధి చేయనున్నారు.
కాగా... బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఎఫైర్స్, ఎమ్ టీవీ యూ 2007 నుంచి ఫుల్‌బ్రైట్-ఎమ్ టీవీ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టాయి. సంగీతం యొక్క గొప్పదనాన్ని తెలిపే కార్యక్రమాలను ప్రోత్సహించేందుకుగానూ ఈ స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.
ఇదిలా ఉంటే... ప్రవాస యువతి టీనా వధ్వాతో పాటు నార్త్ కరోలినా- చాపెల్ హిల్ యూనివర్సిటీకి చెందిన ఆండ్రూ మాగిల్, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మైఖేల్ సిల్వర్స్, జార్జి టౌన్ యూనివర్సిటీకి చెందిన చాపెల్ సొలైమనిలు ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయిన వారిలో ఉన్నారు. ముంబైలోని పేద యువతపై బాలీవుడ్ సంగీతం ప్రభావం, ప్రాబల్యంపై ఓ డాక్యుమెంటరీని రూపొందించేందుకు టీనా త్వరలో భారతదేశానికి రానున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మురళీక్రిష్ణకు తానా ఆర్ధిక సహాయం.
- "సీఈఓ ఆఫ్ ద ఇయర్"గా ఇంద్రా నూయీ
- అమెరికన్లకూ పూజ్య బాపూజీయే ఆదర్శప్రాయుడు
- "మిస్ ఇంగ్లండ్" బరిలో నలుగురు ఎన్నారైలు
- ఫార్చ్యూన్-500 జాబితాలో ఇంద్రానూయీ
Older news items:
- విశాల్ హత్య కేసులో పురోగతి
- ఆ ఎన్నారైకి 17 ఏళ్ల వరకూ ఏటా రూ.1.2 కోట్లు ఇవ్వాలి
- "తానా" వేదికపై రాజకీయ గొడవ
- తానా సంభరాలు-2009
- తానా మహాసభలు ప్రారంభం



















