ఈ ఇద్దరు తీవ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందినవారు కాగా, వారిద్దరినీ హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వీరిద్దరూ జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో శిక్షణ పొందారు. బెంగళూరు పేలుళ్ల కేసులో వీరిద్దరినీ పోలీసులు విచారించారు. త్వరలో జరగబోతున్న ఎన్నికల సందర్భంగా దాడులు చేసేందుకు లష్కరే తోయిబా 2005లోనే వ్యూహరచన చేసినట్లు వీరు వెల్లడించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత్య చేసేందుకు సైనుద్దీన్ అనే బాంబు తాయారీ నిపుణుడిని లష్కరే తోయిబా నియమించిందని, అయితే అతను ప్రణాళిక అమలు చేయడానికి ముందే అరెస్ట్ అయ్యాడని పోలీసులు చెప్పారు.
ఇదిలా ఉంటే గత ఏడాది ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు తాము బాంబులు సరఫరా చేసినట్లు ఈ ఇద్దరు తీవ్రవాదులు అంగీకరించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ, నరేంద్ర మోడీ, తదితర నేతలు, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు ఈ ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో తెలిసిందని పోలీసులు వెల్లడించారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ప్రభుత్వ ఏర్పాటుకు ఫోర్త్ ఫ్రంట్ తప్పనిసరి: లాలూ
- సౌమ్య హత్యకేసు నిందితులపై మోకా ప్రయోగం
- 440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్
- charge sheet produced: satyam scam
- గౌహతి పేలుడు: ఎనిమిదికి చేరిన మృతులు
Older news items:
- మంత్రి లాలూ అరెస్టుకు ఎస్పీ ఆదేశాలు జారీ
- పోలీసులు అదుపులో సిక్కు జర్నలిస్టు
- నాలుగో కూటమి కోసం చిరుకు అమర్ అహ్వానం
- చిదంబరంపై బూటు విసిరిన విలేకరి






















