రాజకీయాల్లో విరామమనేది ఉండదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
ఫలితాల వెల్లడి అనంతరం భాజపా ప్రదర్శన గురించి ఆయన మొదటిసారి ప్రతిస్పందించారు. భాజపా, ఎన్‌డీఏలను ప్రతిపక్షంలో కూచోవాలని ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమమని, దానిని వినమ్రంగా స్వీకరిస్తున్నామని చెప్పారు.
''భాజపా, ఎన్‌డీఏలు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల్లో పాల్గొన్నాయి. వాటిని మరోసారి ప్రతిపక్షంలోనే కూచోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అలాగే పాలక పక్షమైన యూపీఏ, కాంగ్రెస్‌లకు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం ఇచ్చారు'' అని వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవటంతో భాజపా 120 స్థానాలు నష్టపోయిందని అన్నారు. ''గుజరాత్ పాలన అభివృద్ధి పథంలోనే సాగుతుంది. యూపీఏ కూడా ఈ మార్గాన్నే ఎంచుకోవాలని కోరుతున్నా'' అని సూచించారు. మొదట్నుంచీ తాను గుజరాత్‌లోనే ఉన్నానని, ఇక ముందు కూడా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
| Comments |
|
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
- భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధనౌక
- యుపిఏకు మాయా బేషరతు మద్దతు
- ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
- కొత్త లోక్‌సభలో నాలుగోవంతు నేరచరితులే
- రోడ్డుప్రమాదంలో 21 మంది మృతి
- కేంద్ర ప్రభుత్వాని కరుణానిధి భరోసా
- ఎన్నికల్లో గెలవడం గొప్ప అనుభూతి
- 14వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి
- రాజీనామా సమర్పించిన ప్రధాని
- ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రకాష్ మెహ్రా మృతి






















