ఆస్టేలియాలో భారతదేశానికి చెందిన మూడేళ్ల బాలుడు మరణించాడు.
ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడు గుర్షన్ సింగ్ చన్నా శవమై తేలాడు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్షన్ సింగ్ చన్నా మృతదేహం ఓక్లాండ్ జంక్షన్ వైల్డ్ వుడ్ రోడ్డులో గురువారం రాత్రి కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అధికారులు ఆ బాలుడి కోసం గాలింపు చేపట్టారు. గాలింపు చేపట్టిన అధికారులకు అతను శవమై కనిపించాడు.
అతను ఎలా మరణించాడనే విషయం శవ పంచనామాలో కూడా తేలడం లేదు. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు శుక్రవారం చెప్పారు. తమ కుమారుడు అదృశ్యమైన 45 నిమిషాలకే బాలుడి తల్లి హర్ ప్రీత్ కౌర్ చన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మెక్సికోలో భారీ భూకంపం
- బిగ్ బ్యాంగ్ ప్రయోగం విజయవంతం
- ఒబామా ట్విటర్ ను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్టు
- పాక్ లో పేలుళ్లు: 39 మంది మృతి
- ఫోన్సెకా ఆమరణ నిరాహార దీక్ష
Older news items:
- పెంటగాన్ వద్ద కాల్పులు: ముగ్గురికి గాయాలు
- ఇండో-పాక్ సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం: గిలానీ
- అమెరికా మీడియాలో నెట్ న్యూస్ ది మూడో స్ధానం
- బంగ్లా గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: 21 మంది మృతి!
- ఆస్ట్రేలియా కంప్యూటర్లకు తాళాలు!






















