గరీబ్ అండ్ గరీబ్ స్వీటర్ అనే పేరుతో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కూలీలు గురువారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో అంటే రాత్రి 9.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన సుమన్ అనే కార్మికుడు చెప్పాడు.
పొగ పీల్చడంతో పాటు.. కాలిన గాయాలతో సుమారు 50 మంది బాధపడుతున్నారని, వీరిలో 20-25 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. దీనిపై గాజీపూర్ జనరల్ ఆస్పత్రి ఎండీ అతుల్ ఇస్లాం మాట్లాడుతూ.. సుమారు 20 మందిని ఆస్పత్రికి తీసుకొచ్చారని, వీరిలో 11 మంది మృతి చెందినట్టు తెలిపారు.
అలాగే, టోంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన కార్మికుల్లో 11 మంది మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. అలాగే, తైరున్నీసా స్మారక వైద్య కళాశాల, ఆస్పత్రిలో మరో ముగ్గురు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
దీనిపై ఢాకా ఫైర్ కంట్రోల్ రూమ్ డ్యూటీ ఆఫీసర్ నజ్రుల్ ఇస్లామ్ స్థానిక న్యూస్ డాట్ కామ్‌తో మాట్లాడుతూ.. పది ఫైర్ యూనిట్లు, ఆరు అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు చెప్పారు. రెండు గంటల పాటు పొగతో కుస్తీపడిన అగ్నిమాపక సిబ్బంది రాత్రి 1.30 గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఫోన్సెకా ఆమరణ నిరాహార దీక్ష
- ఆస్టేలియాలో భారతీయ బాలుడు మృతి
- పెంటగాన్ వద్ద కాల్పులు: ముగ్గురికి గాయాలు
- ఇండో-పాక్ సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం: గిలానీ
- అమెరికా మీడియాలో నెట్ న్యూస్ ది మూడో స్ధానం
Older news items:
- ఆస్ట్రేలియా కంప్యూటర్లకు తాళాలు!
- శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు: ఆధిక్యంలో రాజపక్సే!
- ఫొన్సెకా హోటల్‌ను చుట్టుముట్టిన శ్రీలంక సైన్యం
- సముద్రంలో కూలిన ఇథియోపియా విమానం
- నలుగురితో నారాయణ: ట్విట్టర్ లోకి ఒబామా






















