హైదరాబాద్ లో సీమాంధ్రవాసులు 40 లక్షల మంది ఉన్నారన్న దానిలో వాస్తవంలేదని,
నాలుగు లక్షల మందిని మించిలేరని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. ఒక పూస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అన్నది తమ సమస్యకాదని, అదివారి సమస్య అని వ్యాఖ్యానించారు.కాలపరిమితితో.. తెలంగాణ ఏర్పాటు దిశగానే కమిటీ ఉంటుందని ఆశిద్దామని, కమిటీ విధివిధానాల్ని పరిశీలించిన తర్వాత అది కేవలం కాలయాపనకు పనిచేసే కమిటీ అని తేలితే తానే మొదట రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేసినట్లు సీమాంధ్రకు చెందిన కొందరు వింతవాదన చేస్తున్నారని, భౌగోళిక విస్తరణ అభివృద్ధి కాదన్నారు. హైదరాబాద్‌పై చేస్తున్న వితండవాదన పక్కనపెట్టాలని, ఒకవేళ దీన్ని అలాగే కొనసాగిస్తే తాము కూడా విశాఖపట్నం, తిరుపతిలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కోరతామని చెప్పారు.
More articles :
» కేంద్ర ప్రకటన వచ్చాక స్పందిస్తాం: కేసీఆర్
సమావేశంలో తాము చెప్పాల్సిందే చెప్పామన్నారు తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు.
» తెలంగాణాకు జైకొట్టిన "యాష్కీ" మగాడు: కేసీఆర్
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఎంపీ మధుయాష్కీ నిజమైన మగాడు
» తిరుపతి హుండీలో మాకు వాటా ఉంది:కేసీఆర్
హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మరోసారి గళం విప్పారు.
» వైఎస్ విధానాల వల్లే వరదలు:కెసిఆర్
కాంగ్రెస్ (వైఎస్) ప్రభుత్వ జల విధానాల వల్లే రాష్ట్రంలో జల విలయం సంభవించిందని టిఆర్‌ఎస్...
» వైఎస్-బాబు... వీరిద్దరూ తోడు దొంగలే: కేసీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడులు ఇద్దరూ...