హీరో అల్లు అర్జున్ నటిస్తున్న వరుడు సినిమా షూటింగ్ తెలంగాణ ఆందోళనకారులు శుక్రవారం అడ్డుకున్నారు.
హైరాబాదు సమీపంలోని మూసాపేట ట్రావెల్ రోడ్డులో షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న తెలంగాణవాదులు అక్కడికి చేరుకుని షూటింగ్ ను అడ్డుకున్నారు. సినిమా షూటింగ్ జరగడానికి వీలు లేదంటూ అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. దాంతో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.ఇటీవల రోజా నటిస్తున్న గోలీమార్ చిత్రం షూటింగును, సునీల్ నటిస్తున్న మర్యాద రామన్న షూటింగును తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకున్నారు. అంతకు ముందు ఓసారి అల్లు అర్జున్ వరుడు చిత్రం షూటింగ్ ను కూడా అడ్డుకున్నారు. మహేష్, విష్ణుల చిత్రాల షూటింగులను కూడా అడ్డుకున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















