2008వ సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ మూవీ 'వాంటెడ్'.
ఏంజలీనా జోలీ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో ఘనవిజయాన్ని సాధించింది. టింబూర్ బెక్మాంబిటోవ్ దర్శకత్వంలో వచ్చిన వాటెండ్ సినిమాను యూనివర్సల్ మూవీస్ వారు తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందించాలని దర్శకుడు ప్రయత్నించగా జోలీ ఇందుకు నో చెప్పిందట. దీనికి కారణం ఆమె గ్ర్యావిటీ అనే ఓ సైంటిఫిక్ సినిమాలో నటించాలనుకోవడమే. దీంతో డేట్లు సర్ధలేని పరిస్థితిలో ఆమె ఈ వాంటెడ్ సీక్వెల్ కు నో చెప్పిందట. దీంతో దర్శకనిర్మాలు జోలీ లేకుండా ఈ సినిమాను రూపొందించే సాహసం చెయ్యలేక సినిమానే ఆపేసారు.ఇక ఏంజలీనా ప్రస్తుతం ది టూరిస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో జానీ డెప్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆమె గ్ర్యావిటీ సినిమా షూటింగులో పాల్గొననుంది. కాగా ఆమె నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ ది సాల్ట్ ఈ వేసవికి విడుదల కానుంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- పీకలదాకా తాగి స్క్రిప్టు పోగొట్టుకున్న ఘనులు
- అమెరికా అధ్యక్షున్ని చంపాలనుకున్నది ఎవరు
- ఛీఛీ నేనంత మందితో కాదు.. కేవలం ఇద్దరితోనే ఎంజాయ్ చేసాను..!!
- భార్య సినిమాలతో... భర్త ఇంటి పనులతో బిజీ బిజీ..
- తండ్రి మృత్యుపోరాటాన్ని చూసి విలివిలలాడిన పిల్లలు..!!
Older news items:
- 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
- టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
- నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!
- ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!
- ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!






















