ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ తన ప్రియుడు అలెక్స్ రెయిడ్ ను ఎట్టకేలకు వివాహం చేసుకుంది.
ఇన్నాళ్లు ఓ సారి కలసివుంటూ, ఓ సారి విడిపోతూ దాగుడుమూతలు ఆడిన వీరిద్దరూ నిన్న లాస్ వెగాస్ లో ఒకటయ్యారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు. రెయిడ్ లండన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో విజేతగా తిరిగి రావడంతో తామిద్దరం వెంటనే వివాహం చేసుకోవాలని క్యాటీ నిర్ణయించుకోవడంతో వీరిద్దరూ హడావిడిగా పెళ్లిచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.గత ఏడాది తన భర్త పీటర్ ఆండ్రీ నుండీ విడిపోయాకా క్యాటీ రెయిడ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. మధ్యలో ఓ సారి అభిప్రాయబేధాలతో విడిపోయినా రెయిడ్ ఆమెను బుజ్జగించి తిరిగి తన దారికి తెచ్చుకున్నాడు. ఆమె కోసమే బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా తిరిగి వచ్చాడు, ఆమె మనసును గెలుచుకున్నాడు. దీంతో ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరి వైవాహిక బంధం అయినా కలకాలం కొనసాగాలని ఆశిద్దాం..!!
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
- టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
- నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!
- ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!
- ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!
Older news items:
- 'అవతార్' సినిమాకు ఇక ఆస్కార్ అవార్డు కలలో మాటే..!!
- ఆ సూపర్ హిట్ బూతు చిత్రం త్రీడీలో
- బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్తింట్లోకి మేగన్‌ఫాక్స్!
- మైఖేల్ జాక్సన్ చిట్ట చివరి వీడియోను ప్రదర్శించనున్న 'గ్రామీ'...!!
- ఆమె చనిపోయిందనే విషయం నాకు ముందుగానే తెలుసు..!!






















