ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు ఎవరికి వస్తుందో తెలిపే డైరెక్టర్స్ గిల్డ్ అవార్డు ఈ ఏడాది 'ది హర్ట్ లాకర్స్' సినిమాకు దర్శకత్వం వహించిన క్యాథరిన్ బిగిలోను వరించింది.
తన మాజీ భర్త, అవతార్ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్ నుండీ ఈమెకు గట్టిపోటీ ఎదురైనా ఆమె విజేతగా నిలిచింది. దీంతో ఆస్కార్ అవార్డును కూడా ఈమె సొంతం చేసుకోనుంది. అదెలాగంటే 1948వ సంవత్సరం నుండీ నిర్వహిస్తున్న ఈ అవార్డుల్లో విజేతగా నిలిచిన దర్శకున్నే ఆస్కార్ వరిస్తుండటం జరుగుతోంది. 50 ఏళ్లకు పైగా చరిత్ర వున్న ఈ అవార్డుల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే ఈ అంచనా తప్పింది. దీనికి తోడు క్యాథరిన్ రూపొందించిన ఈ సినిమా ఇరాక్ యుద్ధనేపథ్యంలో జరుగుతుంది. అవతార్ సినిమా ఓ ఊహాజనిత కథ కాగా ఇది ఆలోచింపజేసే రియల్ స్టోరీ కావడం మరో ప్లస్ పాయింట్. దీంతో ఈ ఏడాది ఆస్కార ఖచ్చితంగా క్యాథరిన్ నే వరిస్తుందనే అందరూ భావిస్తున్నారు.ఈ వార్తతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొంది, ఆస్కార్ తనకే వస్తుందనే ధీమాతో వున్న కామెరూన్ ఢీలా పడ్డారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కలెక్షన్లలో టైటానిక్ అధిగమించిన అవతార్ అవార్డుల్లో అధిగమించలేదనే విమర్శలు ఎదురవుతున్న ఈ సమయంలో ఉత్తమ దర్శకుడిగా కూడా ఆస్కార్ మిస్ అయితే ఎలాగా అని కామెరూన్ ఆలోచనలో పడ్డారంట. ఆయన శ్రేయోభిలాషులు మాత్రం ఇప్పటి వరకూ ఆరు సార్లు అంచనా తప్పింది, ఈ సారి కూడా ఆ అంచనా తలక్రిందులయి ఖచ్చితంగా ఆస్కార్ నీకే వస్తుంది అని దైర్ఘ్యం చెబుతున్నారంట. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మార్చి 7వ తారీఖు వరకూ ఆగాల్సిందే...!!
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
- నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!
- ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!
- ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!
- రెండో పెళ్లయినా నిలబడేనా..!?
Older news items:
- ఆ సూపర్ హిట్ బూతు చిత్రం త్రీడీలో
- బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్తింట్లోకి మేగన్‌ఫాక్స్!
- మైఖేల్ జాక్సన్ చిట్ట చివరి వీడియోను ప్రదర్శించనున్న 'గ్రామీ'...!!
- ఆమె చనిపోయిందనే విషయం నాకు ముందుగానే తెలుసు..!!
- బ్రిట్నీ జీవితంలో మరోసారి నీలినీడలు అలుముకోనున్నాయా..!!






















