బుల్లితెరపై కార్టూన్ రూపంలో వచ్చినా, వెండి తెరపై కనిపించినా దారం సాయంతో ఎంత ఎత్తునుండయినా దూకేసి సాలీడులా పాకుతూవెళ్లి సాహసాలు చేసే స్పైడర్ మ్యాన్ కు వున్న ఆదరణ ప్రత్యేకమయినది.
ఇప్పటి వరకూ మూడు స్పైడర్ మ్యాన్ సినిమాలు రాగా అన్నీ రికార్డు స్థాయి విజయాలను నమోదుచేసుకున్నవే కావడం విశేషం. కాగా ఇప్పుడు నాల్గవ భాగం స్పైడర్ మ్యాన్ రీ బూట్ సినిమా అగిపోయిన సంగతి తెలిసిందే. 2011 వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా 2012 వేసవికి వాయిదా పడింది. ఈ సినిమా లో కథానాయకుడిగా నటిస్తున్న టోబే మ్యాగ్యూర్ మరియు దర్శకుడు శ్యామ్ రైమి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడంతో ఈ సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ సినిమాను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా విడుదల చెయ్యలని సోనీ సంస్థ భావిస్తోంది.కాగా ఈ సినిమాకు దర్శకుడిగా జేమ్స్ కామెరూన్ లాంటి ఎంతో మంది పెద్ద దర్శకుల పేర్లను పరిశీలించిన సోనీ సంస్థ ఈ బాధ్యతను యువ దర్శకుడు మార్క్ వెబ్ కు కట్టబెట్టింది. వెబ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం (500)డేస్ ఆఫ్ సమ్మర్ అనే రొమాంటిక్-కామెడీ చిత్రం విమర్శకుల ప్రశంసలను పొందటంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. వెబ్ ఈ చిత్రానికే కాకుండా మరో రెండు స్పైడర్ మ్యాన్ చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ స్పైడర్ మ్యాన్ నాల్గవ భాగం యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో సోనీ పిక్చర్స్ ఓ యువదర్శకున్ని ఎన్నుకోవడం విశేషం.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఆ సూపర్ హిట్ బూతు చిత్రం త్రీడీలో
- బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్తింట్లోకి మేగన్‌ఫాక్స్!
- మైఖేల్ జాక్సన్ చిట్ట చివరి వీడియోను ప్రదర్శించనున్న 'గ్రామీ'...!!
- ఆమె చనిపోయిందనే విషయం నాకు ముందుగానే తెలుసు..!!
- బ్రిట్నీ జీవితంలో మరోసారి నీలినీడలు అలుముకోనున్నాయా..!!
Older news items:
- అమెరికా అధ్యక్షుడి ప్రాణాలు తీయడానికై హెలీకాప్టర్ నుండీ కిందకు దూకేసిన జోలీ..!!
- గోల్డెన్ గ్లోబ్ అవార్డుల పంట పండించుకొని ఆస్కార్ కై పరుగులు తీస్తున్న 'అవతార్'..!!
- మరో 'అవతార్' లాంటి సినిమా..!!
- వారిద్దరూ మరో సారి విడిపోనున్నారు
- చివరి అంకానికి చేరిన 'హ్యారీ పోటర్'..!!























