ప్రాచీన యోగ పద్ధతులు:
జ్ఞాన యోగ : జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటం. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. సృష్టి రహస్యం తెలుసుకుని దాని మూల కేంద్రాన్ని చేరుకోవటం.
భక్తియోగ : భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. తమని తాము అర్పించుకోవటం.
కర్మయోగ : ప్రతిఫలాన్ని ఆశించకుండా, తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించటమే కర్మయోగ.
మంత్రయోగ : మీకిష్టమైన మంత్రాన్ని లేదా శబ్దం ద్వారా -- రామ కావచ్చు లేదా ఓం కావచ్చు -- చేరవలసిన గమ్యాన్ని చేరటం.
యంత్ర యోగ : ఇష్టమైన భగవంతుని విగ్రహరూపాన్ని ప్రతిష్టించుకుని ఆరాధించటం, అందులో లీనమవటం.
లయ యోగ : ఇష్టమైన దానిలో ఇమిడిపోవటం, కలిసిపోవటం, అదే లోకంగా జీవించటం.
కుండలిని యోగ : శరీరంలో ఇమిడివున్న తెలియని శక్తిని బైటకు తీసి దానిద్వారా గమ్యాన్ని చేర్చటం.
తంత్ర యోగ : మంత్ర తంత్రముల ద్వారా సాధించటం.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26






















