తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > యోగాసనాలు > యోగాసనాలు వేసే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


యోగాసనాలు వేసే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు

E-mail Print
User Rating: / 13
PoorBest 

ఆసనాలు వేసే ముందు మొట్ట మొదటగా మీరు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం.

తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది.

ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది.

* ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి.
* తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోండి
* ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి.
* తెల్లవారు జామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.
* శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.

* పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం మీ ఇష్ట మైన ఆసనాన్ని వేయండి.
* ప్రశాంతంగా కనులు మూసుకోండి.
* మీ ధ్యాస శ్వాసమీదే నిలపండి.
* గాలి వదిలినప్పుడు పొట్ట లోపలకు, పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదో గమనించండి. (దీనికై, పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మాత్రం మీ శ్వాస సరి కాదని గుర్తించాలి.)
* ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి.

* ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. ఏమాత్రం తొందర పడొద్దు.
* వేసిన ఆసనంలో కొద్ది సెకన్ల పాటు అలాగే వుండాలి.
* ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి.
* కుంభకం వేసేటపుడు అధిక రక్తపోటు వున్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే చేయండి.
* గాలి పీల్చటం, వదలటం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి.
* ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాస పడుతూ చేయకండి. మీ శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంత సేపే వుండండి. 

Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.
Anonymous  - Very Useful   |2009-10-06 23:04:46
The information is very useful for those who are new to yoga and those who dont
know the rules but doing yoga.
Thanks TeluguNow team.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 123 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries