సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తీసుకునే ఇలియానాకు ఇంకో సినిమా మిస్సయిపోయింది.
అంటె ఇంకో కోటి రూపాయలు ఈ భామ కోల్పోయినట్లయ్యింది. ఇంతకుమునుపు ‘అపరిచితుడు’ విక్రమ్ సరసన ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి ఇలియానా చేజారిపోయింది. తాజాగా తన తొలిచిత్ర కథానాయకుడు రామ్‌తో రెండోసారి జత కట్టే అవకాశం కూడా ఊరించి.. ఊరించి చివరకు ఉసూరుమనిపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానా స్థానంలో జెనీలియాను తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానా పేరు ప్రచారంలో ఉండడం తెలిసిందే. తెలుగులో తప్ప మరో భాషలో ఎంతమాత్రం మార్కెట్ లేని ఇలియానా కోటి రూపాయలకు పైసా తక్కువిచ్చినా తీసుకునేది లేదంటూ ‘ఎక్‌స్ట్రా’లు చేస్తుండడం చాలారోజులుగా దర్శకనిర్మాతలకు చిరాకు తెప్పిస్తోంది.
తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఎంతోకొంత మార్కెట్ కలిగిన జెనీలియా, త్రిష, ప్రియమణి వంటి హీరోయిన్ల కంటె ఎక్కువ తీసుకుంటుడడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పారితోషికం విషయంలో పట్టూవిడుపూ ప్రదర్శించకపోతే.. టాలీవుడ్‌లో ఇక ఇలియానాకు మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇలియానాకు ‘శక్తి’ చిత్రం ఒక్కటే ఉంది!
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- "ఆరెంజ్"లో "రగులుతోంది మొగలి పొద.."
- ‘జగదీకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్ లో రామ్ చరణ్ తేజ!
- స్వామి నిత్యానంద వేషంలో రవితేజ?
- సింగర్ స్మిత తో శర్వానంద్ ఎఫైర్!
- 8న రంభ వివాహం!
Older news items:
- మాల్యా కుమారుడితో దీపిక డేటింగ్?
- అనుష్క ఫై పడిన పవన్ కన్ను!
- మూడు ముళ్ళు కావాలంటున్న నగ్మ
- బ్రహ్మానందం కొడుకు రెండో చిత్రం
- 'ఛీ'రంజీవి అనిపించేందుకు సిద్ధం అవుతున్న దాసరి 'యంగ్ ఇండియా'























