ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ తన చిత్రంలో హీరోయిన్ గా చేయమంటూ అడిగారు.
కానీ ఆ సమయంలో నాకు కాల్షీట్ కుదరకపోవడంతో ఆయనకు సారీ చెప్పాల్సి వచ్చింది అంటోంది లక్ష్మీరాయ్. "కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె తాజాగా లారెన్స్ హీరోగా చేస్తున్న 'సూపర్ కౌబోయ్' చిత్రంలో చేసింది. ఆ చిత్రం ప్రమేషన్ కోసం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కావాలనే పూరీ ప్రస్తావన తెచ్చి ఈ విషయం చెప్పింది. తనకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయని అయితే ఏదీ ఒప్పుకోలేకపోయానని చెప్తోంది. అంతేగాక తను కెరీర్ ప్రారంభించిన కొత్తలో అందరూ మంచి వారనుకుని వారు చెప్పిన మాటలు నమ్మి ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు ఆ పొరపాట్లు చేయనని అంటోంది. ఇక పూరీ తన తాజా చిత్రం గోలీమార్ కోసం గోపీచంద్ సరసన ఆమెను అడిగారు. అయితే ఆమె రిజెక్టు చేయటంతో ప్రియమణిని తీసుకున్నారు. ఈ విషయం చెప్పటం ద్వారా లక్ష్మీ రాయ్ మిగతా దర్శక,నిర్మాతలకు తాను పూరీ హీరోయిన్ గా కాబోయి ఆగాను, నాకు మంచి డిమాండ్ ఉందనే సంగతి అన్యాపదేశంగా చెప్తోంది.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ‘చంద్రముఖీ 2’ హీరోయిన్ నయనాతార?సమీరారెడ్డి?
- రాజశేఖర్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరింజీవి!??
- పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఆ బాలీవుడ్ రీమేకా!?
- ఆమె క్యారెక్టర్ తెలిసిపోవడంతో.. ఆమె అంటేనే హడలిచస్తున్నారు..!
- దిల్ రాజు 'మరో చరిత్ర' లో శ్రద్ధా దాస్ క్యారెక్టర్
Older news items:
- ఎన్టీఆర్ 'అదుర్స్' జర్కిన్, టోపి వేలం... వివరాలు
- చంద్రముఖి సీక్వెల్ హీరో వెంకటేష్ కన్ఫర్మ్
- ఆరెంజ్ సినిమా కిక్ ఇవ్వడం లేదు: రామ్ చరణ్
- కనీసం రామ్ గోపాల్ వర్మ అయినా హిట్ ఇస్తాడా..!?
- చేదుగా ఉన్న నిజాన్ని భరించలేకే...కాజల్























