మహిళా బిల్లుపై ఆందోళన చేస్తున్న ఏడుగురు రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆరుగురు సమాజ్ వాదీ, ఆర్జెడీ సభ్యులతో పాటు ఏ పార్టీకీ చెందని ఒక సభ్యుడిని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ అమలవుతుంది.
సుభాష్ యాదవ్, సబీర్ అలీ, వీర్పాల్ సింగ్ యాదవ్, నంద్ కిషోర్ యాదవ్, అమీర్ ఆలం ఖాన్, కమల్ అక్తర్, ఎజాజ్ అలీ రాజ్యసభ నుంచి సస్పెండయ్యారు. వారి సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తీర్మానం ప్రతిపాదించగా సభ మూజువాణీ వోటుతో ఆమోదం తెలిపింది.
మహిళా బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం చెలరేగుతుండడంతో పదే పదే సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. రాజ్యసభను చైర్మన్ హమీద్ అన్సారీ రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ వాయిదా పడింది.
| Comments |
|
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
- మహిళా బిల్లుపై బిజెపికి చిక్కులు
- వెనక్కి తగ్గిన లాలూ, ములాయం
- మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- మహిళా బిల్లుపై మమత అలక
- చర్చ లేకుండా మహిళా బిల్లుపై వోటింగ్
- మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం
- మహిళా బిల్లు: యుపిఎకు మద్దతు వెనక్కి
- నేడు రాజ్యసభలో మహిళా బిల్లు
- మహిళా బిల్లుకు మగ ఎంపీలు స్వాగతం
- ఆలయంలో తొక్కిసలాట" 70కు పెరిగిన మృతులు!






















