పెట్రో ధరల పెంపు విషయంలో విపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న నేపథ్యంలో కేంద్రానికి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పూర్తి మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలనుద్దేశించి సోనియా మాట్లాడారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ బడ్జెట్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. ఆర్థికలోటును సరిచేసే దిశలో ఈ బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు. పెట్రో ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం దేశంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. అయితే ప్రస్తుతం ధరల నియంత్రణ అంశమే యూపీఏ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో విపక్షాల తీరును కూడా తప్పుబట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా విపక్షాలు సభకు అడ్డుతగిలిన తీరు సరిగా లేదని, తాము ప్రతిపక్షంలో ఉండగా ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని అన్నారు.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం
- మహిళా బిల్లు: యుపిఎకు మద్దతు వెనక్కి
- నేడు రాజ్యసభలో మహిళా బిల్లు
- మహిళా బిల్లుకు మగ ఎంపీలు స్వాగతం
- ఆలయంలో తొక్కిసలాట" 70కు పెరిగిన మృతులు!
Older news items:
- కేంద్రంతో చర్చలకు సరికొత్త షరతులు విధించిన కిషన్‌జీ!
- డైనోసార్ పిల్లలను మింగిన పాము
- పెట్రో ధరలపై పార్లమెంటులో మంటలు
- భారత్ ను ప్రేమిస్తా, కానీ..: హుస్సేన్
- పెట్రో ధరలు తగ్గించే ప్రసక్తే లేదు: ప్రధాని మన్మోహన్























