సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అందుకు బాధ్యులుగా పేర్కొంటూ ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజులను జనవరి 9వ తేదీన సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అటుపై విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి మరికొందరినీ అరెస్టు చేశారు. ఈ కుంభకోణం వెలుగు చూసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో రంగంలో దిగిన సీబీఐ ఫిబ్రవరి 20న తన దర్యాప్తు చేపట్టింది.
ఇందులో భాగంగా సీబీఐ ఆ సంస్థకు చెందిన మరో ముగ్గురు అధికారులను కస్టడీలోకి తీసుకుంది. అదేసమయంలో సత్యం నిందితులను అరెస్టు చేసి 90 రోజులు పూర్తి కావస్తుండడంతో వారికి బెయిల్ దొరికే అవకాశం లభించకుండా చేసేందుకై సీబీఐ ఆఘమేఘాలపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు సమాచారం. ఎందుకంటే అరెస్టు చేసిన తర్వాత 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితులకు బెయిల్ మంజూరు చేయవచ్చు. అందుకే సత్యం నిందితులకు బెయిల్ రాకుండా చూసేందుకై సీబీఐ ఈ ప్రయత్నం చేసింది.
ఇక సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం రామలింగరాజు, రామరాజు, సత్యం మాజీ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ ఆడిటర్లు గోపాలకృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, రాజు మరో సోదరుడు సూర్యనారాయణ, సత్యం ఉద్యోగులైన రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలంలకు ఈ కుంభకోణంలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, తప్పుడు ధృవీకరణ పత్రాలను నిజమైనవిగా నమ్మించడం తదితర కారణాలతో వీరిపై అభియోగం మోపుతున్నట్టు సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మంత్రి లాలూపై కఠిన చర్యకు మల్హోత్రా డిమాండ్
- టైట్లర్‌కు టిక్కెట్ కేటాయింపుపై కాంగ్రెస్ యోచన
- ప్రభుత్వ ఏర్పాటుకు ఫోర్త్ ఫ్రంట్ తప్పనిసరి: లాలూ
- సౌమ్య హత్యకేసు నిందితులపై మోకా ప్రయోగం
- 440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్
Older news items:
- గౌహతి పేలుడు: ఎనిమిదికి చేరిన మృతులు
- అద్వానీ, మోడీలపై తీవ్రవాదుల గురి: కర్ణాటక
- మంత్రి లాలూ అరెస్టుకు ఎస్పీ ఆదేశాలు జారీ
- పోలీసులు అదుపులో సిక్కు జర్నలిస్టు
- నాలుగో కూటమి కోసం చిరుకు అమర్ అహ్వానం























