1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న జగదీష్ టైట్లర్‌కు అనుహ్యంగా సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వడం రాజకీయ వర్గాలు, సిక్కుల్లో అంసతృప్తి వ్యక్తం అయింది. టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగాయి.
ఇందులో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ జోక్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతోనే సీబీఐ సిక్కు అల్లర్ల కేసులో జగదీష్ టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిందని రాజకీయ పక్షాలు విమర్శించాయి. తాజాగా దైనిక్ జాగరణ్ అనే హిందీ పత్రికలో పనిచేస్తున్నట్లు భావిస్తున్న సిక్కు జర్నలిస్ట్ తన ఆగ్రహాన్ని చిదంబరంపై బూటు విసరి ప్రదర్శించడం సంచలనం సృష్టించింది.
ఈ సిక్కు జర్నలిస్ట్ పేరు జర్నైల్ సింగ్. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో హోం మంత్రిపై బూటు విసిరిన సిక్కు జర్నలిస్ట్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది జర్నైల్ సింగ్‌ను బయటకు తీసుకెళ్లారు. జగదీష్ టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినందుకు నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని జర్నైల్ సింగ్ స్వయంగా వెల్లడించాడు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26























