తమిళనాట పార్లమెంటు ఎన్నికలలో జయలలిత ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి.
అధికార పార్టీపై ప్రజలలో ఉన్న అసంతృప్తి బహిరంగంగానే వెల్లడవుతుండటంతో అది అన్నాడీఎంకేకు లాభించనుంది. మరోవైపు ఆకాశన్నంటిన నిత్యావసర వస్తు ధరలు, శ్రీలంకలో తమిళుల సమస్య, రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్తు కోతలతో ప్రజలు పూర్తిగా పాలకపార్టీపై విసుగెత్తిపోయారని పలు సర్వేలు చెపుతున్నాయి.
పురుచ్చితలైవిగా తమిళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జయలలిత ఎక్కడికక్కడ తన ప్రసంగపు వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తనకు ఏ కుటుంబ బాంధవ్యాలు లేవనీ, పాలకపార్టీ నాయకుని కుటుంబంలోని సభ్యులకు పదవులతోపాటు వ్యాపారాలు కట్టబెట్టాలని, ఈ క్రమంలో పాలకపార్టీ పూర్తిగా బంధువుల బాగోగుల తప్పించి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
హామీల విషయానికొస్తే.... శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక ప్రాంతం, కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఆరు లక్షల పోస్టులు భర్తీ, తపాలా శాఖలో తాత్కాలికంగా పనిచేస్తున్న 3 లక్షల మందిని పర్మినెంట్, చెరకు మద్దతు ధర వంటివెన్నో ఉన్నాయి.
మొత్తమ్మీద చూస్తే జయలలిత సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే లోక్‌సభ ఎన్నికలలో జయలలిత అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- డీఎంకేతో పొత్తు యథాతథం: సోనియా గాంధీ
- మళ్ళీ తీవ్రవాద దాడులు..హెచ్చరిక
- ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్
- ఒబామా దెబ్బ మనకేం..ప్రధాని
- ఓడితే జయప్రద ఆత్మహత్య: అమర్
Older news items:
- అఫ్జల్ ఉరితీతపై కాంగ్రెస్ రాజకీయం: మోడీ
- ఐదో దశ ఎన్నికలు: రేపటితో ప్రచారానికి తెర
- వీరప్ప మొయిలీని తొలగించలేదు: కాంగ్రెస్
- యూపీఏది అసమర్థ పాలన: మోడీ ధ్వజం
- యూపీలో శాంతిభద్రతలు అస్తవ్యస్తం: వరుణ్ గాంధీ























