రాష్ట్రంలోని 10 నౌకాశ్రయాల నుంచి ఇనుప ఖనిజం ఎగుమతులను నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చి
గాలి సోదరులకు షాక్ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంగళవారం మరో షాక్ ఇచ్చారు. ఇక నుంచి ఇనుప ఖనిజం ఎగుమతులకు రాష్ట్రం నుంచి ఎటువంటి అనుమతులూ ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధ, గురువారాల్లో జారీ చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. ఇది గాలి బ్రదర్స్ కు గట్టి దెబ్బగానే భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఉక్కు పరిశ్రమలకు ఖనిజాన్ని సరఫరా చేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని ఆయన తెలిపారు. కేంద్రం పరిధిలో ఉన్న మంగుళూరు నౌకాశ్రయం మినహా రాష్ట్రంలోని మిగిలిన 10 నౌకాశ్రయాల నుంచి ఇనుప ఖనిజం ఎగుమతిని నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇనుప ఖనిజం ఎగమతులపై నిషేధం విధించాలన్న తన ప్రతిపాదనను ఇటీవల జరిగిన జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయంపై త్వరలో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని మన్మోహన్ ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. అక్రమ గనుల తవ్వకాలపై చేపట్టిన చర్యలను ఇటీవల తాను తమ బిజెపి అగ్రనేతలు గడ్కరీ, అద్వానీలకు వివరించానని చెప్పారు. సహజ సంపదను పరిరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మేధావులతోనూ, రచయితలతోనూ చర్చలు జరపనున్నామని ఆయన వివరించారు. సీబీఐ విచారణ చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండుకు తలొగ్గేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- చిదంబరంతో భేటీ కానున్న ఒమర్
- కాశ్మీర్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
- లక్ష లంచంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ సెన్సార్ ఆఫీసర్
- మన్మోహన్‌సింగ్‌తో నేడు బ్రిటన్ ప్రధాని భేటీ
- ముంబయిలో కూలిన బహుళ అంతస్థుల భవనం
Older news items:
- 6 నుంచి లారీల నిరవధిక సమ్మె
- రాయల ఆభరణాలపై 'కేంద్రం' ఆరా
- కార్గిల్ విజయానికి నేటితో పదకొండేళ్లు
- కార్మికులపైకి దూసుకెళ్లిన కారు... ఇద్దరి మృతి
- ఎదురుకాల్పుల్లో 6గురు మావోయిస్టుల మృతి























