ప్రపంచంలో అతి తక్కువ ధరపలికే మధ్యతరగతి కారు టాటా నానో ఇండియాలో గత ఏడాది జరిగ ఆటోషో విడుదలయి అందరి దృష్టిను ఆకర్షించింది.
అటు పైన రికార్డు స్థాయిలో బుకింగులు నమోదుచేసుకుంది. తాజాగా నానో హైబ్రిడ్ వెర్షన్ కూడా తయారవుతోంది. తాజా ఈ లక్ష కారు అమెరికా మార్కెట్ లో అడుగుపెట్టింది. ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగుతున్న ఆటో షో ఇందుకు వేదికయింది. అంతా బాగానే వుంది కానీ ఈ బుజ్జి కారు అమెరికాలో 'లక్ష'ణమయిన కారుగా చెలామణీ అయ్యే అవకాశాలు లేవు. అమెరికా భద్రతా మరియు ఎమన్షన్ స్టాండర్డ్స్ కు అనుకూలంగా తయారవ్వాలంటే ఈ కారు ధర సుమారు 8,000 డాలర్లుగా (అనధికార ధర) పలికే అవకాశం వుంది.ఫ్రాంక్ ఫర్ట్ ఆటో షో తొలి సారి అమెరికన్ల ముందు ఠీవీగా నిలబడ్డ మన నానోకు మంచి స్పందన లభిస్తోంది. ధర 8,000 డాలర్లుగా నిర్ణయించినప్పటికీ ఈ కారు అమెరికాలో చవక కారే కావడం గమనార్హం. ఇంకా అధికారికంగా ధరను ప్రకటించకపోయినప్పటికీ 8,000 డాలర్లకు అటుఇటుగానే నిర్ణయించే అవకాశం వుంది. అన్నీ అనుకూలిస్తే ఈ కారు మరో మూడేళ్లలో అమెరికా రహదార్ల మీజ పరుగులు తీయనుంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- భారతీయ నెం.1 ఆటోసంస్థ మారుతీ సుజుకీ..!!
- i-సీరీస్ లో నెక్స్ట్ వెర్షన్ i-30 ఎప్పుడు..!?
- అదిపోయే సరికొత్త నానో మోడల్: బెదరగొట్టే ఖరీదు..!!
- నిస్సాన్ సరికొత్త స్పోర్ట్స్ కారు 370Z...!!
- భారతీయ విపణిలోకి దేశీయ మెర్సిడెస్ బెంజ్..!!
Older news items:
- హైదరాబాదులో మహీంద్రా జియో హల్ చల్..!!
- రికార్డు సృష్టించిన ముఖేష్ అంబానీ
- ఫోన్ అప్లికేషన్ ద్వారా కార్ డ్రైవింగ్
- బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త...
- టాక్స్ చెల్లింపుదారులకు శుభవార్త
























