పెట్టుబడి మార్కెట్ల పరిశోధన సంస్థ సీఎన్ఐ రీసెర్చ్ సంస్థ చేపట్టిన అధ్యయనం ప్రకారం అంచనా స్థాయి పెరిగి తద్వారా అత్యధిక నిధులతో మదుపుదార్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఐఐలు, దేశీయ మదుపుదార్లు (డీఐఐ) కొనుగోళ్లను పెంచే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో విక్రయాలు కన్నా కొనుగోళ్లు తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది.
గత 15 నెలల కాలంలో స్టాక్ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలను సీఎన్ఐ విశ్లేషించింది. ఈ 15 నెలల కాలంలో ఎఫ్ఐఐలు ఎక్కువగా విక్రయాలపై ఆసక్తిని కనబరచారు. దీంతో స్టాక్ మార్కెట్ వరుసగా కుప్పకూలింది. అదేవిధంగా ఇవే నెలల్లో ఎఫ్ఐఐ కొనుగోళ్లు సాగుతున్నప్పుడు సెన్సెక్స్ మరియు నిఫ్టీల ముగింపు లాభాలతో ఉంటోంది. ఇదే కొనసాగితే.. స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట పండినట్లే.
అదలా ఉంచితే... స్టాక్ మార్కెట్ ప్రస్తుతం పుంజుకున్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం నేపథ్యంలో మదుపుదార్లు జాగ్రత్త వహించాలని మరో విభాగపు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
























