ఇదిలావుండగా ప్రస్తుతం నానో కారు ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన కారుగా గుర్తింపు పొందింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇందులో ప్రయాణించే ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నానోకారును రూపొందించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది "ప్రజల కారు" అని స్వయంగా రతన్ టాటా సంబోధించారు. బైక్‌లపై వెళ్ళే కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వారి రక్షణ నిమిత్తం తక్కువ ధరకు ఈ నానో కారును ప్రజలకు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ కారు ధర దాదాపు ఒక లక్షరూపాయలకు పైమాటేనని వ్యాపార వర్గాలు తెలిపాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది ఈ నానోకారు యూరో-4. ఇతర కార్లకన్నాకూడా ఇది ఎంతో లాభదాయకమని, ఇది అత్యధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కారు అతి తక్కువ కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కారు ఇతర కార్ల కంపెనీలకు ఆదర్శవంతం కాగలదని కంపెనీ భావిస్తోంది.
రియర్ వీల్ డ్రైవ్, రెండుసిలిండర్లు కలిగిన మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇన్జెక్షన్ ఇంజన్ 624సీసీకి చెందినది. ఇది కారు వెనుకభాగంలోవుంది. ఇంకా ఈ కారు దాదాపు ప్రతి లీటరుకు 20-22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. నాలుగు తలుపులున్న ఈ కారులో నలుగురినుంచి ఐదుగురువరకు కూర్చోవచ్చు.
కారు పొడవు 3.1 మీటర్లు, వెడల్పు 1.5 మీటర్లు, ఎత్తు 1.6 మీటర్లుగావుంది. కొత్త ఫీచర్స్‌లో భాగంగా ట్యూబులు లేనటువంటి టైర్లు, సంపూర్ణంగా మెటల్ షీట్ బాడీ, ఇట్రూజన్ రెసిస్టెంట్‌తో కూడిన తలుపులు, ధృఢమైన సీట్లు, సీటు బెల్టులు కలిగివుంటుంది. ఈ సీటు బెల్టులు ప్రయాణించేవారికి కూడా సురక్షితంగావుంటుంది.
నానోకారు డిజైన్ ఎలావుంటుందంటే..ముందు భాగం కోడిగ్రుడ్డు ఆకారంలో ఉంటుంది. చివరన సామాన్లు భద్రపరచుకోవడానికికూడా కాస్త చోటును కల్పించివున్నారు. కారులో పవర్ విండో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
గమనించదగ్గ విషయం ఏంటంటే 1990వ సవత్సరంలో టాటా వాహనాల అమ్మకాల్లో 40శాతం తగ్గుదల కనిపించింది. అలాగే టాటా మోటార్స్‌కు 2000వ సంవత్సరంలో దాదాపు 110 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సివచ్చింది. భారత దేశంలో వాహనాలను తయారు చేయడానికి టాటా మోటార్స్ తొలుత 1945వ సంవత్సరంలో ప్రారంభించింది.
అప్పటినుంచి ఇంత భారీ మొత్తంలో నష్టాలను చూడడం ఇదే ప్రథమం. భారతదేశంలోనే కార్పోరేట్ నష్టాలలో ఇది అతి పెద్ద భారీ మొత్తమని వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నష్టం చాలా సంవత్సరాలవరకు టాటా కంపెనీ పూడ్చుకోలేకపోయిందనికూడా వారు పేర్కొన్నారు.
కాని ఈ నష్టాలవలన టాటా కంపెనీ మంచి గుణపాఠం నేర్చుకుంది. దీంతో టాటా కంపెనీ ఇండికా, సుమో, సఫారీలాంటి వాహనాలను మార్కెట్లో విడుదల చేసి ప్రజల మనసును గెలుచుకుంది.
టాటా కంపెనీ రూపొందించిన నానోకారు మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత భారతదేశంలోని బైక్ కంపెనీల ధరల్లో దాదాపు 20 శాతం తగ్గవచ్చని వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా పాత కార్ల ధరలుకూడా 35శాతం తగ్గే అవకాశాలుంటాయని వారు పేర్కొన్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26






















