మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, తన యావదాస్తి మొత్తం కేవలం రూ.1.38 కోట్ల రూపాయాలేనని సోనియా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ ఆస్తులకంటే సోనియా గాంధీకి కోటి రూపాయలు తక్కువగా ఆస్తులు ఉండటం గమనార్హం.
అఫిడవిట్‌లో సోనియా గాంధీ ఉదహరించిన మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. చేతిలో ఉన్న నగదు రూ.75,000, బ్యాంకులో ఉన్న డిపాజిట్లు రూ.28.61 లక్షలు, పొదుపు మరియు ఆర్బీఐ బాండ్లు కలిపి మరో రూ. 32 లక్షలున్నాయి. ఎన్ఎస్‌సి రూ.1.99 లక్షలు, పీపీఎఫ్ రూ.24.88 లక్షలు, రూ.29 లక్షల విలువ చేసే నగలు, రెండు ప్లాట్ల వ్యవసాయ భూమి( ఎక్కడ ఉన్నదీ తెలుపలేదు) రూ.2.19 లక్షలు.
కాగా సోనియా గాంధీ 2008-09 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5.58 లక్షల ఆదాయపు పన్నును చెల్లించారు. విద్యార్హతలు తెలిపే పట్టీలో సోనియా తాను రెండు కోర్సులను చదివినట్లు పేర్కొన్నారు. ఒకటి ఇటలీలోని శాంత థెరిసాలో ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలకు సంబంధించిన మూడేళ్ల కోర్సు కాగా రెండోది ఇంగ్లీషు భాషలో సర్టిఫికెట్ కోర్సు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26






















