అధికార యూపీఏకు 178 సీట్లు వస్తాయని ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. ఇదిలావుండగా రెండు కూటములకు నేతృత్వం వహిస్తున్న రెండు ప్రధాన జాతీయ పార్టీల్లో బీజేపీకి 144 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 133 సీట్లు సొంతం చేసుకుంటుందని వెల్లడించింది.
ఇప్పుడు యూపీఏకు మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ, భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఆర్జేడీ, ఎల్జేపీలను కూటమిలో ఉంచగలిగితే కాంగ్రెస్‌కు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 235 సీట్ల బలం వస్తుందని అభిప్రాయపడింది.
యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 30 సీట్లు గెలుచుకోనున్నట్లు, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, రాంవిలాస్ పాశ్వాన్ ఎల్జేపీలు బీహార్‌లో 15 సీట్లు పొందుతాయని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సీట్ల సంఖ్యకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరో 43 సీట్లు అదనంగా చేర్చుకుంటుందని, దీంతో ఎన్డీఏ బలం 187కు చేరుతుందని సర్వే పేర్కొంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26






















